calender_icon.png 19 November, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుకు హిడ్మా లేఖ.. ఆయుధాలు వీడేలోపే ఎన్‌కౌంటర్‌

19-11-2025 11:56:27 AM

విజయవాడ: భద్రతా బలగాలపై ఎన్నో దాడులు చేస్తూ చెమటలు పట్టించిన మావోయిస్టు పార్టీ కీలక నేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త హిడ్మా(Maoist Hidma) ఎన్‌కౌంటర్‌లో మరణించే 10 రోజుల ముందు ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోవడానికి రెడీ అయినట్లు ఓ లేఖ బయటకు వచ్చింది. బస్తర్‌లోని ఒక జర్నలిస్టుకు హిడ్మా లేఖ రాసినట్లు తెలుస్తోంది. లేఖలో తన ఆలోచనలు, నిర్ణయాలపై తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించినట్లు సమాచారం. ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉందని, తమ భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమని హిడ్మా తెలిపాడు.

త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్‌ పంపుతామని చెప్పాడు. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందని లేఖలో హిడ్మా తెలిపాడు. జనజీవన స్రవంతిలో కలవాలని ఆలోచించుకున్న హిడ్మా మంగళవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో మరణించారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని ఏపీ ఇంటెలిజన్స్‌ ఏడీజీ  మహేష్‌ చంద్ర లడ్డా బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏపీలో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెల్లడించారు.