రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే బీఆర్‌ఎస్
ఎమ్మెల్యే రోహిత్
రామాయంపేట, జూన్ 24: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఒక్కొక్కరి పై రెండున్నర లక్షలు అప్పు చేసిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో బుధవారం పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ పథకం ద్వారా నక్క యాదయ్య, మంగలి మల్లేశం నిర్మించిన ఇళ్లను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తతో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో తవ్వించిన బోరుబావిని ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం , రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు.
రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఇందిరమ్మ ఇల్లు మాత్రమే దర్శనమిస్తున్నాయని, గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిరుపేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గడిల నగేష్, కాట్రియాల సిద్ధ రాములు, ఎల్లం స్వామి. బైగిరి నాగరాజు . కమ్మరి రమేష్ చారి. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు






