25 June, 2026 | 2:19 AM

చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ

25-06-2026 01:28 AM

తంగళ్ళపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రూ.10 లక్షలు మంజూరు కాగా, భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేరెళ్ల నర్సింగం గౌడ్, స్థానిక సర్పంచ్ వేల్పుల రేణుక రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ప్రజా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న లింగాపూర్ మాజీ ఎంపిటిసి బైరవేణి రాములు ,మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.