13 May, 2026 | 7:24 PM

ఈనెల 18న ఐటిఐ అప్రెంటిస్ షిప్ వ్రాత పరీక్ష

13-05-2026 06:32 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఐటిఐ ఫిట్టర్ ట్రేడ్ లో పాస్ అయిన విద్యార్ధులకు ఐటిసి భద్రాచలం ఆధ్వర్యంలో అప్రెంటిస్ షిప్ కొరకు వ్రాత పరీక్షను ఈనెల18న ఉదయం 9 గంటలకు కృష్ణసాగర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు జరుగుతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు తమ యొక్క ఎస్ఎస్ సి, ఐటిఐ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బయో డేటా ఫాం తీసుకొని రావాలని,అభ్యర్ధుల వయసు 21 ఏళ్ళు మించి ఉండకూడదని తెలియజేశారు. అర్హులైన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.