13 May, 2026 | 7:23 PM

విద్యార్థి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

13-05-2026 06:30 PM

- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ 

గజ్వేల్: విద్యార్థి భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మాబాయి నర్సింగరావులు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐఓసిలో విద్యా వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  చందన రవీందర్ గారు, వైస్ చైర్‌పర్సన్  పద్మాబాయి  హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన వసతులు అందిస్తున్నారని, పేద మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సైతం సహకరించాలన్నారు. ఎంఈఓ కృష్ణ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించడం జరిగిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల సిబ్బంది అవగాహన కల్పించారు.