15 July, 2026 | 5:09 AM

కన్నుపడిందా ఖతమే!

08-06-2024 02:56 AM

జగిత్యాల, జూన్ 7 (విజయక్రాంతి) : జగిత్యాల జిల్లా కోరుట్లలో కబ్జాలు పెరుగు తున్నాయి. కనిపించిన ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు క్షణాల్లో పుడుతున్నాయి. తర్వాత హద్దులు, ప్రహరీ గోడలు.. ఇలా ఒక్కొక్కటిగా తమ సొంతం చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే అదిరింపులు, బెదిరింపులతో కబ్జాలకు అడ్డులేకుండా చేసుకుంటున్నారు. మొన్న కోరుట్ల పట్టణ కావేరీ సమీపంలో కొందరు తమ స్థల కబ్జా చేసి కాంపౌండ్ నిర్మాణం చేసుకొని గేటు పెట్టుకోవడంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అధికారులు దగ్గర ఉండి పోలీస్ బందోబస్తు మధ్య కాంపౌండ్ కూల్చి వేశారు. తాజాగా జిల్లా కేంద్రమైన జగిత్యాలలో బాధితులు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాను ఆశ్రయించారు. జగిత్యాల జిల్లాలో జరిగే తంతు.

ఆడపిల్లల పెళ్లికి కట్నం కింద ఇద్దామని కొందరు, పైకం కొంత జమయ్యాక  ఇల్లు నిర్మించుకుందామని మరికొందరు కొనుగోలు చేసిన స్థలాలు కబ్జాకు గురౌతున్నాయని అనేక మంది బాధితులు పోలీస్ అధికారుల, అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ నుండి పొందిన తప్పుడు వి.యల్.టి నెం. 2110105720 దారా, ఇనెం. 4 సౄష్ఠించి, 722 చ.గ. భూమి,ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్టు లేకుండా తమ భూమిని కొందరు  ఆక్రమించుకోవడానికి సిద్దమయ్యారని భూ యజమానులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు, జగిత్యాల కు చెందిన కీర్తి విజయలక్ష్మి, వూటూరి గీతారాణి, గొల్లపెల్లి సత్యనారాయణ లు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇదే పట్టణానికి చెందిన ఖాజా అమీరొద్దీన్ అనే వ్యక్తి తమ భూమి అక్రమంగా, తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని,722 చ.గ. భూమిని ఆక్రమించు కొనుటకు ప్రయత్నిస్తు న్నాడని పేర్కొన్నారు.

ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి, ఖాజా అమీరొద్దీన్ అనే వ్యక్తి దారా తప్పుడు వీయల్టీకి సహకరించిన మున్సిపల్ అధికారులపై, సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని  తగిన న్యాయం చేయగలరని విన్నవించుకున్నారు. ఇందుకు సంబం ధించిన పూర్తి వివరాలను వారు తమ ఫిర్యాదులో కలెక్టర్ కు వివరించారు.ముగ్గురం హస్నాబాద్ గ్రామ శివారు (జగిత్యా) సరేనెంబర్ 1599 నందు 0 గుంటల భూమిని సేల్ డీడ్ నెం. 4660/2011 దారా కొనుగోలు చేశామని, ఆ భూమిపై తాము సరహక్కులు కలిగియున్నామని పేర్కొన్నారు. కానీ, మా భూమిని అక్రమంగా, అన్యాయంగా కాజేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది వ్యక్తులు  మున్సిపల్ అధికారులతో కుమ్మక్కైనారని వారు ఆరోపించారు.

ఆస్తిపన్ను అసెస్మెంట్ అనుసరించి భూముల జాబితా జగిత్యాల మున్సిపాలిటి రికార్డుల్లో 722 చ.గ.లకు ఇ.నెం. 4 13 1999 కి గాను తప్పుడు రిజిష్టర్డ్ డాక్యుమెంట్ నమోదు చేశారన్నారు. దీని దారా తప్పుడు అసెస్మెంట్ డాక్యుమెంట్ను సౄష్టించి, జగిత్యాల మున్సిపల్ కార్యాలయము నందు అక్రమ వి.యల్.టి. నెం. 2110105720 ను ఖాజా అమీరొద్దీన్ పేరిట జారీ చేయడం జరిగిందని, ఆ తప్పుడు వి.యల్.టి. నెం. 2110105720, ఇ.నెం. 4 ఆసరా చేసుకొని 722చ .గ. భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆక్రమించుకొనుటకు ప్రయత్నిస్తున్నా డని వారు ఫిర్యాదు చేశారు. తప్పుడు వియల్ టి నెంబర్ సౄష్టించి, 2012లో పనిచేసి బదిలీపై వెళిన మున్సిపల్ కమిషనర్ సంత కమును 2024లో మున్సిపల్ అధికారులు ఫోర్జరీ చేసి, సహకరించిన మున్సిపల్ అధికారులపై మరియు తమ భూమిని అక్రమం గా, తప్పుడు పత్రాలతో దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న ఖాజా అమీరొద్దీన్ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని కీర్తి విజయలక్ష్మి, వూటూ రి గీతారాణి, గొల్లపెల్లి సత్యనారాయణ లు జిల్లా కలెక్టర్ ను కోరారు.

మాఫియాతో చేతులు కలిపి

ఇదిలా ఉండగా భూ మాఫియాతో చేతు లు కలిపి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బల్దియా ఆఫీసర్ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. అధికార దురినియోగానికి పాల్పడుతూ ఒక్కో మ్యూటేషన్కు బాధితుల నుం చి రూ.లక్షలు వసూలు చేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. నాలుగు రోజుల కింద తమ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్ర యించడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు రావడంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. విచారణలో భాగంగా సదరు మున్సిపల్ ఆఫీసర్ను అదు పులోకి తీసుకుని ప్రశ్నించగా మరికొందరు పెద్దల పేర్లు తెర మీదకు వస్తున్నట్లు సమాచారం. జగిత్యాలలోని టీఆర్ నగర్ కు చెందిన మహమ్మద్ రషీద్, కొయ్యడ లక్ష్మి అనే ఇద్దరు పేద కుటు ంబా లకు ప్రభుతం పట్టాలను అందజేసింది. 

కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా

ఈ మేరకు గతంలో కొందరు అక్రమార్కులు కబ్జా చేసి పట్టాలు పొందారనే ఆరోపణల నేపథ్యంలో ఎటువంటి మ్యూటేషన్లు చేయకూడదని ఆప్పటి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను లెక్క చేయకుండా 2023 నవంబర్లో మహమ్మద్ రషీద్ పట్టాను 9 అనే ఇంటి నంబర్ ఇస్తూ మ్యూటేషన్ చేశారు. నిబం ధనలకు విరుద్దంగా పట్టా భర్త పేరు మీద ఉండగా, భార్య అజ్రాబేగం పేరు మీద మ్యూటేషన్ చేశారు. అలాగే కొయ్యడ లక్ష్మి పట్టాను మ్యూటేషన్ చేస్తూ 9 ఇంటి నంబర్ కేటాయించారు. ఎలాంటి డాక్యూమెంట్ లేకుండా ప్రభుత భూములను మ్యూటేషన్ చేయడంపై విమరలు వస్తున్నాయి.  ఈ మ్యూటేషన్లకు రూ.ల క్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ పే దారా ట్రాన్సాక్షన్స్ చేసినట్లు తెలిసింది.

ఓ ల్యాండ్ మ్యూటేషన్‌కు బాధితులు మున్సిపల్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పని కావడం లేదు. అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్న చేసేందుకు సదరు అధికారులు సాకులు చెబుతున్నారు. రూ.3లక్షలిస్తే చేస్తానని చెప్పడ ంతో గత్యంతరం లేక బాధితులు అడిగినంత అందిస్తున్నారు. అందులో ఏకంగా బాధితుడి ఫోన్ నుంచి సదరు అవినీతి ఆఫీసరే సయంగా ఆయన ఫోన్ పే నంబర్ కు ఈ ఏడాది జనవరి 20న రూ.45వేలు, నెల 26, 28న రూ.15వేలు చొప్పున రెండుసార్లు, 30న రూ.50వేలు, ఫిబ్రవరి 20న రూ.30 వేలు, 25న రూ.10వేలు ఇలా మొత్తం రూ.1.65లక్షలు గుంజినట్లు తెలుస్తోంది.

మిగిలిన మొత్తాన్ని సదరు అధికారి కుటుంబ సభ్యులకు ముట్టజెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఓ భూ కబ్జా విషయంలో బాధితులు పోలీసుల ఆశ్రయించగా ఆ అవినీతి అధికారి వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు ఫోన్ పే అప్లికేషన్ డిలీట్ చేసుకు న్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారినిరక్షించే పనిలో అధికార పార్టీ నేత  పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి  అధికారి మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు నుంచి పరిరక్షణకు విశ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.