17 July, 2026 | 1:23 AM

సంగారెడ్డిలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన జగ్గారెడ్డి

17-07-2026 01:23 AM

కొత్త బస్టాండ్ నుండి పిఎస్సార్ గార్డెన్ వరకు సాగిన యాత్ర

భజనలు, కోలాటాలతో భక్తిపారవశ్యంలో మునిగిన పురవీధులు

సంగారెడ్డి, జూలై 16 (విజయక్రాంతి): అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరి గింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు.

ఈ రథయాత్ర సం గారెడ్డి కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమై, పట్టణ పురవీధుల గుండా పిఎస్సార్ (PSR) గార్డెన్ వరకు సాగింది. రథం కదిలిన వెంబడి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘జగన్నాథ్ కీ జై’ అంటూ హరినామ స్మరణ చేశారు. యాత్ర పొడవునా భక్తులు చేసిన భజనలు, ఆధ్యాత్మిక నాట్యాలు, సంకీర్తనలతో పట్టణ వీధులన్నీ భక్తిపారవశ్యంతో మారుమోగాయి. ముఖ్యంగా మహిళా భక్తులు సాంప్రదాయ దుస్తులలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, వీక్షకులను అలరించాయి. భక్తులకు ఎక్కడికక్కడ ఇస్కాన్ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

గత కొటన్ని సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణంలో జగన్నాథ రథయాత్రను నిరంతరాయంగా నిర్వహిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న ఇస్కాన్ స్థానిక శాఖ ప్రతినిధులను జగ్గారెడ్డి ఈ సం దర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన స్వయంగా భక్తి పాటలు పాడుతూ భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, ప్రముఖ నాయకులు కూన సంతోష్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, ఇస్కాన్ ప్రతినిధులు,పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.