8 May, 2026 | 9:33 AM

రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్‌గా జైపాల్‌రెడ్డి

30-06-2025 02:28 AM

కామారెడ్డి రోటరీ క్లబ్ కు ఉత్తమ అవార్డు

కామారెడ్డి, జూన్ 29 (విజయ క్రాంతి), రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా కామారెడ్డి ఆర్కే విద్యాసంస్థల చైర్మన్ సీఈవో జైపాల్ రెడ్డి ఎంపికయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన పలు రకాల అవారడ్స్ లో కామారెడ్డి రోటరీ క్లబ్ ఉత్తమ అవార్డు సాధించింది. ఉత్తమ సేవలందించినందుకు దిష్టి గవర్నర్ చౌదరి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

కామారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజనర్సింహారెడ్డి చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో అవార్డులు అందుకున్న వారిలో కామారెడ్డి రోటేరియన్స్ శ్రీశైలం, కాశీనాథం, పున్న రాజేష్, వై శంకర్, సుధాకర్ రావు, సబ్బని కృష్ణ హరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.