08-02-2026 12:39:54 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౭: భారత్- వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేశారు. ఈ ఒప్పందాన్ని ఒక ‘అసంపూర్ణ ప్యాకేజీ’ అని అభివర్ణించారు. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే భవిష్యత్తులో దేశీయ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం విదేశీ మెరుగులకే ప్రాధాన్యమిచ్చిందని, స్వదేశీ ఆత్మను విస్మరించిందని విమర్శించారు. ఒప్పందం ద్వారా రైతులకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు కలిగే ప్రయోజనాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు.