calender_icon.png 8 February, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు ఎలాంటి నష్టం ఉండదు

08-02-2026 12:38:20 AM

వ్యవసాయం, హస్తకళ, చేనేత రంగాలకు కూడా..

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఒప్పందం వర్తించదు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౭: అమెరికా భారత్ మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో డెయిరీ, పౌల్ట్రీ, వ్యవసాయ రంగాలతో పాటు హస్తకళలు, చేనేత రంగాలకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశా రు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకూ ఒప్పందం వర్తించదని, వాటికి ఎలాంటి హానీ ఉండదని తేల్చిచెప్పారు. తాజా ఒప్పందం భారత్‌కు అపారమైన ప్రయోజనాతు ఒనగూరుస్తుందని ఆకాంక్షించారు.

న్యూఢిల్లీలో శని వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒప్పందం ద్వారా అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మన గ్రామీణ జీవనోపాధులు కాపాడుతూనే, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు పెద్దపీట వేయడం ఈ ఒప్పందంలోని గొప్ప విశేషమని కొనియాడారు.

‘వికసి త్ భారత్ 2047’ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, వైన్, స్పిరిట్స్ వంటి వస్తువులకు మాత్రమే దిగుమతి రాయితీలు ఇస్తున్నామని, ఇతర వస్తువులకు ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చిచెప్పారు. దేశీయ రైతులకు పోటీ ఎదురయ్యే ఎలాంటి రంగాన్ని కూడా ఒప్పందంలో చేర్చలేదని స్పష్టం చేశారు. 

ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల మార్కె ట్ అందుబాటులోకి రానుందని అంచనా వేశారు. అలాగే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే టీ, కాఫీ, మసాలా దినుసులు, పండ్లు, కొబ్బరి నూనె తదితర వస్తువులకు ఎలాంటి పన్నులు ఉండవని ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు 13 బిలియన్ డాలర్ల విలువైన మెడిసిన్ (ఫార్మా), వజ్రాలు, ఆభరణాలు, స్మార్ట్ ఫోన్లు, విమాన, ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతులకూ సుంకాల నుంచి వెసులుబాటు లభిస్తుందని వివరించారు.

ఏడాది నుంచి రాత్రింబవళ్లు సాగించిన చర్చల ఫలితంగానే ఈ అద్భుతమైన ఒప్పం దం సాకారమైందని పేర్కొన్నారు. వచ్చే నెల లో రెండు దేశాలు ఈ చారిత్రాత్మక ఒప్పందం పై తుది సంతకాలు చేయనున్నాయని వివరించారు. అమెరికా నుంచి వచ్చే జన్యుమార్పిడి ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించబోమని ఆయన ఖరాఖండిగా చెప్పారు.