24 May, 2026 | 3:26 PM

Breaking News

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •  

భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో

24-05-2026 02:32 PM

న్యూఢిల్లీ: భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశాలని, గల్ఫ్ సంక్షోభం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించామని  అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. భారతదేశంలో పర్యటించడం గర్వంగా ఉందని, ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి నడుస్తోందన్నారు. భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే అని, ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వాములని రూబియో తెలిపారు. గత 48 గంటలుగా గల్ఫ్ ప్రాంతంలోని తామ భాగస్వాములతో కలిసి ముసాయిదా రూపకల్పనపై పనిచేయడంలో మేము కొంత పురోగతి సాధించామని రూబియో వెల్లడించారు. 

ఈ ప్రయత్నం గనుక విజయవంతమైతే, అంతిమంగా మాకు  ఎటువంటి సుంకాలు లేకుండా తెరిచి ఉండే జలసంధులు లభిస్తాయన్నారు. రాబోయే కొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉందని తాను గట్టిగా నమ్ముతున్నానా.  ముఖ్యంగా జలసంధులకు సంబంధించి అంతిమంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తామను ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో, ఆ స్థితికి చేర్చగల ప్రక్రియకు సంబంధించిందన్నారు.

త్వరలోనే అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్ కి వస్తారని, ఇరుపక్షాలకు ప్రయోజనకరమైన, సుస్థిరమైన శాశ్వత వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నా. అమెరికా-భారత సంబంధాలు తమ వేగాన్ని ఏమాత్రం కోల్పోలేదని, ప్రపంచంలోని ఏ దేశంతోనైనా మాకున్న సంబంధాలను, భారతదేశంతో మాకున్న వ్యూహాత్మక కూటమికి భంగం కలిగించే విధంగా తాను పరిగణించనుని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.