22-02-2026 02:06:56 AM
రాహుల్‌గాంధీకి జాజుల శ్రీనివాస్‌గౌడ్ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి మార్చి నెలలో భర్తీ జరిగే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీకి, ఇంకోటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాహుల్‌గాంధీకి శనివారం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేసే దిశగా రాజ్యసభ స్థా నాలలో ఒకటి బీసీలకు ఇంకొకటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కోరారు.
రాజ్యసభ సీటు బడుగులకు అస్తిత్వం అయితే, అగ్రకుల ధనవంతులకు అలంకారం లాంటిది, పెద్దల సభకు పేదల అస్తిత్వం కోసం పోరాడే వారిని పంపించాలే కానీ, రాజ్యసభ సీటును అడ్డం పెట్టుకొని స్కాములు చేసే గద్దలకు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారు, బడుగులకు రాజ్యసభ సీటు మీరు కేటాయిస్తే తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలని పోరాడుతారు అని జాజుల పేర్కొన్నారు.