15 July, 2026 | 8:38 PM

ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి

15-07-2026 08:36 PM

కమిషనర్ బి శ్రీనివాస్

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్క ఇంటి యజమాని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని యాదగిరిగుట్ట కమిషనర్ బీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో సిడిఎంఎ ఆదేశానుసారం జల శక్తి అభయాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచారంలో భాగంగా గోశాల ప్రభుత్వ బాలుర, బాలికల హై స్కూల్ లో మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ నీటిని అమూల్యమైన సంపదగా భావించాలని వాటిని పొదుపుగా వాడుకోవాలని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని పిల్లలకు సవివరంగా వివరించి వారి చేత జల ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ శాలిని, బాలుర బాలికల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ సురేందర్, పిల్లలు పాల్గొన్నారు.