5 May, 2026 | 1:57 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

సెప్టెంబర్‌లో ‘జామ్ జంక్షన్’

25-07-2024 12:05 AM

‘జామ్ జంక్షన్’ పేరుతో సెప్టెంబర్ 6న ఓ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైటెక్స్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ ఈవెంట్ విశేషాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఈ సంద ర్భంగా ఫిల్మ్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “జామ్ జంక్షన్’ మ్యూజిక్ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. చాలా మంది ప్రతిభావంతులను ఒక ఫ్లాట్ ఫాం మీద చూడబోతున్నాం” అని తెలిపారు. ‘జామ్ జంక్షన్’లో ఆకట్టుకున్న వారికి నగదు బహుమతితోపాటు తమ సినిమాలో మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇస్తాం’ అని ప్రకటించారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “నేను బ్యాండ్ నుంచే వచ్చాను. బ్యాండ్ ఎమోషన్ నాకు తెలుసు. ఇప్పటికీ రెగ్యులర్‌గా బ్యాండ్ మ్యూజిక్‌కి వెళ్తాను. హైదరాబాద్ ఇప్పుడు మ్యూజికల్ సిటీ. చాలా మంచి బ్యాండ్స్, మ్యుజిషియన్స్ వస్తున్నారు. వారితో కలిసి పని చేస్తున్నాను. ‘జామ్ జంక్షన్’లో భాగమవుతుండటం ఆనందంగా ఉంది” అని చెప్పారు. ‘మంచి ప్రయత్నం చేస్తున్న టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్‌” అని నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు. శ్రీ ఈవెంట్స్ కంపెనీ ఫౌండర్, సీఈవో శ్రీ ‘జామ్ జంక్షన్ కాన్సెప్ట్’ విశేషాలను వివరించారు.