26 August, 2026 | 9:41 AM

ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెంచు జాతులు కనుమరుగు

26-08-2026 09:07 AM

ఐటీడీఏకు రెగ్యులర్ పిఓను నియమించాలి

చెంచు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముర్ల రమేష్ రెడ్డి

అచ్చంపేట: చెంచుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ఐటీడీఏ (పివిటిజి) కార్యాలయం ఎదుట మంగళవారం రాష్ట్ర ఆదివాసి చెంచు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీడీఏకు రెగ్యులర్ని పిఓని నియమించలేదని అలాగే సిబ్బందిని సైతం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నట్లే చెంచులకు ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోవడంతో చెంచులోని కొన్ని జాతులు అంతరించే దశకు చేరుకున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. దర్నాలో చెంచు, తోటి, కోలం, కొండారెడ్డి తెగలకు చెందిన ఆదివాసీ ప్రతినిధులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముర్ల రమేష్ రెడ్డి, అయిపోతది రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మడారి మంజుల వర్కింగ్ సెక్రటరీ కురిసెంగ వేణు, తోటి సంఘం నాయకులు నైతం రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.