10-02-2026 07:21:51 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా, భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయానికి విచ్చేసిన జంగా రాఘవరెడ్డి దంపతులకు ధర్మకర్తలు, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆదిశంకరాచార్యులు, వల్లభగణపతిని దర్శించిన అనంతరం ఆలయ స్నపనమండపంలో అర్చకులు టక్కర్స్ సత్యం ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు మహాదాశిర్వచనం నిర్వహించి, అమ్మవారి శేషవస్త్రములను బహుకరించి, ప్రసాదములను అందజేశారు.