19 March, 2026 | 2:22 AM

నేటి నుంచి జపాన్ మాస్టర్స్

12-11-2024 12:00 AM

బరిలో సింధు, లక్ష్యసేన్

కుమామొటొ (జపాన్): భార త స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ ప్రతిష్ఠాత్మక జపాన్ మాస్ట ర్స్ సూపర్ 500 టోర్నీకి సిద్ధమయ్యారు. నేటి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ఈ ఇద్దరు తమ స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో సింధూ క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యింది.

అటు లక్ష్యసేన్ కూడా ఆర్కిటిక్ ఓపెన్‌తో పాటు డెన్మార్క్ ఓపెన్‌లోనూ క్వార్టర్స్ చేరకుండానే ఇంటిబాట పట్టా డు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి జపాన్ మాస్టర్స్ టోర్నీ కీలకం కానుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ మలేషియాకు చెందిన లియోంగ్ జున్ హావోను ఎదుర్కోనున్నాడు. ఇక డబుల్స్‌లో భారత్ నుంచి గాయత్రి గోపిచంద్ జాలీ జంట బరిలోకి దిగనుంది.