calender_icon.png 21 February, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు వరదాయిని.. జవహార్ ఎత్తిపోతల పథకం

21-02-2026 12:39:56 AM

మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర మండలంలోని వంగవీడు గ్రామం వద్ద వైరా నదిపై 630 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన జోవహర్ ఎత్తిపోతల పధకం పనులను ఈ రోజు ఇరిగేషన్ డి ఈ ఈ నాగబ్రహ్మం తో కలిసి ప్రాజెక్ట్ మ్యాప్ ను పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు. తదనంతరం చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ రైతులకు వరదాయిని జవహర్ ఎత్తిపోతల పథకం అని.. చివరి భూములకు జలసిరి అని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా లోని సాగర జలాలకు చివరి ఆయకట్టుగా ఉన్న మధిర ఎర్రుపాలెం మండలాలకు ప్రస్తుతం సాగర్ జలాలు మూడో జోన్ లో సరఫరా అవుతున్నాయి.ఈ రెండు మండలాలకు సాగర్ నీటిని రెండోజోన్ లో సరఫరా చేసేందుకు వీలుగా. రెండు మండలాలకు సాగర్ జలాలను రెండో జోన్ నుంచి తరలించేందుకు మధిర మండలంలోని  వైరా నదిపై వంగవీడు గ్రామంలో 630 కోట్ల రూపాయలతో మధిర, ఎర్రుపాలెం మండలంలోని ఉన్న రైతులకు మేలు చేసే విధంగా మన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు గత సంవత్సరం ఆగస్టు నెలలో శంకుస్థాపన మరియు భూమి పూజ చేసినారు.

అట్టి పనుల్లో భాగంగా ఇప్పటికే భూ సేకరణ కార్యక్రమం పూర్తిచేసుకుని పంప్ హౌస్ లో నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి వచ్చే సంవత్సరం నాటికి ఈ పని పూర్తి చేసి సుమారు 50 వేల ఎకరాలకు సాగర్ జలాలు అందిస్తారు అన్నారు.  మధిర ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,వైస్ చైర్మన్ అవులూరు సత్యనారాయణ రెడ్డి,సర్పంచ్ చిట్టిపోగు ప్రసాద్, ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి, అనుమోలు వెంకటకృష్ణారావు, చొప్పకట్లపాలెం సర్పంచ్ బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు బాణావత్ రమణ నాయక్, గుడేటి బాబురావు, అద్దంకి రవికుమార్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, వెంకయ్య బాబు, నిడమానూరు వంశీ,తూమాటి నవీన్ రెడ్డి, పతేపురపు సంగయ్య, బిట్ర ఉద్దండయ్య, మైలవరపు చక్రి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.