25 August, 2026 | 9:14 AM

హైదరాబాద్ హాస్టల్ వాష్‌రూంలో యువతి ప్రసవం.. నవజాత శిశువును కిటికీ నుంచి విసిరివేత, పసికందు మృతి

25-06-2026 12:35 AM
  1. నవజాత శిశువును కిటికీ నుంచి విసిరివేత
  2. ప్రాణాలు కోల్పోయిన శిశువు
  3. యువతికి తీవ్ర రక్తస్రావం.. నీలోఫర్‌లో చికిత్స
  4. హైదరాబాద్ నగరంలో అమానుషం

హైదరాబాద్, సిటీబ్యూరో జూన్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో యువతి రహస్యంగా ప్రసవించి, పుట్టిన వెంటనే నవజాత శిశువును కిటికీ నుంచి విసిరివేయడంతో పసికందు ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం యువతి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హాస్టల్‌లో ఎవరూ గుర్తించలేదు.. వాష్‌రూంలో ప్రసవం చేసి నవజాత శిశువును కిటికీ నుంచి విసిరేసిన యువతి ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలోనే వాష్‌రూమ్‌కు వెళ్లిన యువతి అక్కడే రహస్యంగా ప్రసవించింది. శిశువు పుట్టిన విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో వాష్‌రూమ్ వెంటిలేటర్ నుంచి కిందకు విసిరేసింది. ఎత్తు పైనుంచి కింద పడటంతో ఆ శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి హాస్టల్ గదిలోనే అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ నగరానికి సంబంధించిన మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ న్యూస్ విభాగాన్ని సందర్శించండి.

కుటుంబ సభ్యుల అనుమానాలు

బాధితురాలి కుటుంబ సభ్యులు, ఆమె సొంత బావ కారణంగానే గర్భం దాల్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

గోల్కొండ పోలీసులు నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ హాస్టల్‌లో ఏమి జరిగింది?

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో యువతి వాష్‌రూంలో ప్రసవించింది. అనంతరం పుట్టిన నవజాత శిశువును కిటికీ ద్వారా బయటకు విసిరివేయడంతో శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర రక్తస్రావంతో యువతి ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహిళల భద్రత, నేరాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం క్రైమ్ న్యూస్ విభాగంలో చదవండి.

FAQ's

Q1. హైదరాబాద్ హాస్టల్‌లో ఏమి జరిగింది?
ఓ యువతి హాస్టల్ వాష్‌రూంలో ప్రసవించి, నవజాత శిశువును కిటికీ నుంచి విసిరివేయడంతో శిశువు మృతి చెందింది.

Q2. ఈ ఘటన ఎక్కడ జరిగింది?
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Q3. యువతి ప్రస్తుతం ఎక్కడ చికిత్స పొందుతోంది?
తీవ్ర రక్తస్రావంతో యువతిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Q4. పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు?
పోలీసులు కేసు నమోదు చేసి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేపట్టారు.

Q5. కుటుంబ సభ్యులు ఏ అనుమానం వ్యక్తం చేస్తున్నారు?
యువతి సొంత బావ వల్లే ఆమె గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.