20-01-2026 07:26:49 PM
కోదాడ: సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 28వ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ కోదాడ జయ ఐఐటి ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు 26 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి బంగారు పథకాలను సాధించి సత్తా చాటారు. మంగళవారం పట్టణంలోని జయ ఐఐటి ఒలంపియాడ్ స్కూల్ ఆవరణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ఆయన మాట్లాడారు.
4వ తరగతి విద్యార్థులు విద్యార్థులు, టి ఆరాధ్య, బి చేతన, యమ్ చరిత. 5వ తరగతి విద్యార్థులు యస్ అద్విక, బి రిత్విక, ఎ హవిష. 6వ తరగతి నుండి ఎ అధ్వైత్ క్రిష్ణ, ఎ చరణ్ సాయి రెడ్డి, రుత్విక్ సాయి.7వ తరగతి విద్యార్థులు, సిహెచ్ నందిని, జి హిమజ, కె యశ్వంత్, ఎస్కె సుఫియాన్, కె మణిదీప్ రెడ్డి, ఎస్కె జాహిద్. 8వ తరగతి విద్యార్థులు ఎ గగన రెడ్డి, పి వీక్షిత, ఎ. ప్రణవ్. 9వ తరగతి విద్యార్థులు, యమ్ తూర్పిక, వి లాస్యశ్రీరెడ్డి, వై దేవిసిరి, కె భానుమిత్ర, నౌహియాఫిర్లోసాఖాన్. 10వ తరగతి విద్యార్థులు ఎస్కె హీరాతన్వీర్, ఎస్ సాకెత్, ఎస్కె అబ్దుల్ ముసావ్వీర్ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.
ప్రతిభను కనపరిచిన విద్యార్థిని, విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ జయవేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి, ప్రధానోపాద్యాయులు చిలువేరు వేణు అభినందించారు. తమ అత్యుత్తమ ప్రోగ్రామ్ ద్వారా ఇటువంటి విజయాలను భవిష్యత్తులో కూడా సాధిస్తామని తెలిపారు. తమపై విశ్వాసాన్ని ఉంచి అన్ని విధాల సహకరిస్తున్న తల్లిదండ్రులకు , శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.