20-01-2026 07:30:45 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సీనియర్ నాయకులు ముదిగొండ సాంబయ్య, చంద్రకళ ఆధ్వర్యంలో వార్డు నెంబర్-3 నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కాషాయ కండువా కప్పి సాధారణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ పై కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.