calender_icon.png 20 January, 2026 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అంకితభావ కృషితో సాధించాలి

20-01-2026 07:19:57 PM

 రీసెర్చ్ & డెవలప్మెంట్ (కార్పొరేట్) అధికారి  వెంకటరమణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మందమర్రి ఏరియాలో రీసెర్చ్ & డెవలప్మెంట్ (కార్పొరేట్) అధికారి సి.హెచ్. వెంకటరమణ పర్యటించారు. మంగళవారం మందమర్రికి వచ్చిన ఆయనను జీఎం ఎన్ రాధాకృష్ణ తన కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి శాలుగప్పి సన్మానించారు. అనంతరం వెంకటరమణ జీఎం రాధాకృష్ణతో కలిసి KKOC గనిని సందర్శించి అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.

అనంతరం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఆఫీసులోజరిగిన  సమావేశంలో కార్పొరేట్ అధికారి  సి హెచ్. వెంకటరమణ  మాట్లాడుతూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు, ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేసినప్పుడే లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువవుతుందని అన్నారు.