13 April, 2026 | 1:44 AM

వజ్ర హోమ్స్‌లో ప్లాట్లు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

13-04-2026 12:00 AM

తెలంగాణ రాజ్యాధికార 

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ 

సూర్యాపేట ఏప్రిల్ 12 (విజయక్రాంతి): సూర్యాపేటలోని 29వ వార్డులో ఉన్న వజ్రా హోమ్స్ లో 2015 నుంచి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్ర మ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని ప్రస్తుతం ఉమాజ్యోతి రెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులతొ కలిసి వజ్రా హోమ్స్ లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతు న్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు.

ఆదివారం వజ్రా హోమ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమా జ్యోతి రెడ్డికి వజ్రా హోమ్స్ లో ఎలాంటి భూమి లేకుండా తప్పుడు దస్తావేజులు సృష్టించి వజ్రా హోంలో 9000 గజాలు తన భర్త చిత్తరంజన్ రెడ్డి పేరా ఉన్నట్లు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకొని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు అధికార పార్టీ నాయకులతో అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు.

ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయిందన్నారు. అనంతరం తప్పుడు దస్తావేజులు రద్దు చేసుకుంటామని మాట్లాడినట్లు తెలిపారు.   మోసం చేయాలనే ఆలోచనతో వజ్రా హోమ్స్ లో ఉన్న ప్లాట్ల ను, ఇండ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. వీరిపై వి చారణ చేసి మరల ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.