11-11-2025 06:38:12 PM
కోదాడ: రామానుజన్ గణిత అకాడమి రామచంద్రాపురం వారు నిర్వహించిన గణిత ఒలంపియాడ్లో జయ ఐఐటి ఒలంపియాడ్ పాఠశాల 19 మంది విద్యార్థులు రెండవ లెవెల్కు అర్హత సాధించి సత్తాచాటారని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని జయ ఐఐటి ఒలంపియాడ్ పాఠశాలలో అర్హత సాధించిన విద్యార్థులను అభినందించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పోటీతత్వం అలవర్చుకోవాలని తెలిపారు.
తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, తోడ్పడిన తమ ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి ప్రధానోపాధ్యాయులు చిలివేరు వేణు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.