calender_icon.png 11 November, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 13న జరిగే బీసీల ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలి

11-11-2025 06:35:31 PM

హనుమకొండ (విజయక్రాంతి): బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13న, హన్మకొండ ఏకాశిల పార్క్ ముందు ఒక్క రోజు బీసీల ధర్మ పోరాట దీక్ష వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టునున్నట్లు బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. 13న జరిగే బీసీల ధర్మ పోరాట దీక్షకు బీసీ సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగస్తులు, ప్రజా సంఘాల నాయకులు, బీసీ మహిళలు, బీసీ యువత, బీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గోని బీసీ ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.