11-11-2025 06:42:33 PM
దేవరకొండ (విజయక్రాంతి): కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున దేవరకొండ బీసీ సంఘం డివిజన్ కార్యవర్గం బాడీ తరుపున డిఈ సిహెచ్ విద్యాసాగర్ ని డివిజన్ ఆఫీస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డివిజన్ ప్రెసిడెంట్ పెద్దశెట్టి వసంత కుమార్, దేవరకొండ డివిజన్ సెక్రెటరీ నాతి యాదయ్య, దేవరకొండ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంచనపల్లి సైదులు, దేవరకొండ డివిజన్ కోశాధికారి పాతన బోయి నరేష్, గౌరవ అధ్యక్షులు ఎస్ యాదయ్య, మిరియాల వెంకటపతి, కోట్ల కృష్ణయ్య, నడింపల్లి వేణు కుమార్, తమ్ముడు బోయిన మల్లేష్, దేవరకొండ డివిజన్ లిజనింగ్ ఆఫీసర్ సాయి కృష్ణ, సిహెచ్ నరేంద్ర డివిజన్ బాడీలో ఉన్న కార్యవర్గం, రెండు సబ్ డివిజన్లో ప్రెసిడెంట్ సెక్రటరీలు, దేవరకొండ డివిజన్లో ఆల్ సెక్షన్ లీడర్లు, బీసీ సంఘం తరఫున బీసీ కార్మికులు అందరూ పాల్గొనడం జరిగింది.