calender_icon.png 9 February, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపేటలో జయమ్మ.. సంగారెడ్డిలో నిర్మలమ్మ

09-02-2026 12:15:41 AM

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు తల్లీ కూతుళ్ల ప్రచారం

సంగారెడ్డి, జనవరి 8(విజయక్రాంతి):మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెర పడనుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. సంగారెడ్డిలో శనివారం జరిగిన ప్రజలతో జగ్గారెడ్డి ముఖాముఖి సభ వియవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆదివారం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సదాశివపేటలో జయా చైతన్య రెడ్డి,  సంగారెడ్డిలో నిర్మలా జగ్గారెడ్డి ఇంటిటి ప్రచారంలో పాల్గొన్నారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున పట్టణంలో ని 11,31,32,33,6 వ వార్డుల్లో ఇం టింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో పాటు వార్డులో ఇల్లు లేని పే దలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మరోపక్క సదాశివపేట మున్సిపాలిటీలో జయా చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. 17,18,4,8 వార్డులతో పాటు పలు వార్డులలో ఇంటింటి ప్ర చారం నిర్వహించారు. సదాశివపేటలో సర్టిఫికెట్లు ఉన్న 5500 మందితో పాటు ఇల్లు లేని ప్రతీ పేదలకు ఇంటి స్థలాలు జగ్గారెడ్డి ఇచ్చి తీరుతారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.