calender_icon.png 9 February, 2026 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

09-02-2026 12:14:40 AM

మెదక్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి) :మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు, ఎ న్నికలు జరుగు మున్సిపాలిటీ ఏరియాలలో తాత్కాలికంగా వాయిదా చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికల జరుగు మున్సిపాలిటీ ఏరియాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు, మున్సిపాలిటీ ఏరియాలలో కూడా యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి మండలాలలో ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని ప్రజల వినియోగించుకోవాలని వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు.