10 August, 2026 | 7:22 PM

Breaking News

లోకకళ్యాణార్థం బీరంగూడలో ఘనంగా శతరుద్రాభిషేకం   •   అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •  

హెడ్‌కోచ్‌గా జయసూర్య

08-10-2024 12:00 AM

కొలంబొ: మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య  శ్రీలంక జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ వరకు జయసూర్య ఈ పదవిలో కొనసాగుతాడని లంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌ల్లో కోచ్‌గా జయసూర్య తన పాత్రను సమర్థంగా పోషించడంతో అతడికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పినట్లు బోర్డు తెలిపింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి జయసూర్య ఫుల్‌టైమ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.