10 August, 2026 | 8:16 PM

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి

10-08-2026 07:12 PM

పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామ సర్పంచ్ ధారబోయిన మల్లేశం తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లేశంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతురాలి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీరి వెంట మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ రావు, బద్రి మల్లేశం, నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్ రెడ్డి, బాబా గౌడ్, అంటోని, శ్రీనివాస్ గౌడ్, మేడిశెట్టి రాము, దండం సామెల్, మల్లేశం, చంద్రన్న తదితరులున్నారు.