శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ
ఆలేరు,(విజయక్రాంతి): శారాజిపేట గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ డప్పు కళను కొనసాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా శారాజిపేట గ్రామ సర్పంచ్ కంతి మధు సీనియర్ డప్పుల కళాకారుల బృందానికి ప్రత్యేకంగా డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంతి మధు మాట్లాడుతూ... గ్రామీణ సంస్కృతిలో డప్పు కళకు ప్రత్యేక స్థానం ఉందని, తరతరాలుగా ఈ కళను కొనసాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కళాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. డప్పుల కళాకారులు మాట్లాడుతూ తమను గుర్తించి డ్రెస్సులు అందజేసిన సర్పంచ్ కంతి మధుకు కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులకు అండగా.. కళలకు ప్రోత్సాహంగా.. శారాజిపేట గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని గ్రామస్తులు అభినందించారు.






