మానవత్వం చాటుకున్న కలెక్టర్ జితేష్
17-06-2024 12:05 AM
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 16 (విజయక్రాంతి): బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకొన్నారు. బూర్గంపాడు మండలం సారపాక క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఆటో, బైకు ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు, ఆటోలో వెళుతున్న నలుగురు ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ ఘటన స్థలంలో తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను దగ్గరుండి అంబులెన్సులో భధ్రాచలం దవాఖానకు తరలిం చారు. ప్రమాద బాధితులపట్ల మానవత్వం చాటుకున్న కలెక్టర్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు.






