15 June, 2026 | 8:43 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

జీవో 46 ను రద్దు చేసి ఎన్నికలను వాయిదా వేయాలి

27-11-2025 12:00 AM

ముకరంపుర, నవంబరు 26 (విజయ క్రాంతి): జీవో 46ను రద్దుచేసి ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ డిమాం డ్ చేశారు. బుధవారం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలం గాణ చౌక్ లో ల నాయకులు కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీసీలని నమ్మించి మోసం చేసిందని ఆ పార్టీకి రాబోవు రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెద్ది శ్రీధర్ రాజ్, రవీంద్ర చారి, ఉమ మహేశ్వర్, నారాల శ్రీకాంత్, దిలీప్, కిశోర్, సందీప్, తదితరులుపాల్గొన్నారు.