27-11-2025 12:00:00 AM
కబీర్ బోధనలు సమాజానికి మార్గదర్శకం...
కొత్తగూడెం,నవంబర్ 26, (విజయక్రాంతి):మదీనా మస్జిద్ ప్రక్కన, జామియా ఆలా హజరత్ లిల్ బనాత్ మదర్సా యొక్క సంగే బునియాద్, సుల్తానూల్ హింద్ సూఫీ సంత్ హజరత్ ఖ్వాజా, గరీబ్ నవాజ్ ఉర్సు సందర్భంగా, భారత జాతీయ అహలే సున్నత్ వల్ జమాత్ ధర్మ గురువు అయినటువంటి ముహద్దిసే కబీర్ హజరత్ అల్లామా జియావుల్ ముస్తఫా ఖాద్రి అంజది మద్దేజిల్లహు ఆలి సహాబ్, ముఖ్య అతిథిగా డిసెంబర్ 9న మొట్టమొదటి సారిగా భద్రాద్రి కొత్తగూడెం, 14న రామవరం కు వస్తున్న సందర్భంగా మహమ్మద్ అంకుష్,ఖాద్రి రజ్వీ ఏర్పాటు చేసిన పోస్టర్ ను బుధవారం రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ ఎ కూనంనేని సాంబశివరావు క్యాంప్ కార్యాలయంలో గోడ పత్రాన్ని విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 95 సం,,రాలు వయస్సు నిండిన హజరత్ ముహద్దిసే కబీర్ లాంటి సూఫీ గురువులు అడుగు పెట్టడం, అందులోనూ తన కొత్తగూడెం నియోజక వర్గంలో రావడం ప్రప్రథమం అని, ఆయనను దర్శించుకొని ఆయన బోధనలు వినే భాగ్యం కలగడం మనందరి అదృష్టం అన్నారు. అనితర సాధ్యమైన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ముస్లిం సోదరులకు ,వివిధ మస్జిద్ కమిటీలకు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సీపీఐ కార్యదర్శి సాబిర్ పాషా మాట్లాడుతూ, సమసమాజ నిర్మాణం కోసం ,ప్రపంచ శాంతి పెంపొందించడం కోసం ముహద్దిసే కబీర్, బోధనలు ఆదర్శనీయం అని కులమతాలకు అతీతంగా ఆయన బోధనలు వినడానికి, ప్రజలందరూ పాల్గొని భిన్నత్వం లో ఏకత్వానికి కొత్తగూడెం ప్రతీకగా నిలవాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఏ డబ్ల్యూ స్, ప్రెసిడెంట్ అమీర్ ఖాద్రి ,మదీనా మస్జిద్ మరియు రామవరం అహలె సున్నత్ వల్ జమాత్ అధ్యక్షులు ఉస్మాన్ పాషా ,కొత్తగూడెం మైనార్టీ నాయకులు అక్బర్ ,యాకుబ్ పాషాగారు, ఖాజా భాయ్,యాకుబ్ , జమాల్ ,అఫ్జల్ భాయ్ , ఫైజుద్దీన్ గారు, అలీం మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు.