calender_icon.png 28 November, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ డెమో ఫార్మ్ ప్రకారం సమీకృత వ్యవసాయం చేస్తున్న మహిళా రైతును అభినందించిన కలెక్టర్

27-11-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26, (విజయక్రాంతి):మోడల్ డెమో ఫార్మా ప్రకారం సమీకృత వ్యవసాయం చేస్తున్న మహిళా రైతులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. బుధవారం ఆయన లక్ష్మీదేవిపల్లి మండలం, లోతువాగు గ్రామంలోని పడిగ. ఆపర్ణ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ యూనిట్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సమీకృత వ్యవసాయంలో అవలంబిస్తున్న పద్ధతులు తీసుకుంటున్న చర్యలు, మార్కెటింగ్ , బూర్గంపహాడ్ మండలం, బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మోడల్ డెమో ఫార్మ్ను ఆదర్శంగా తీసుకుని సమీకృత వ్యవసాయం చేపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఆపర్ణ తమ పొలంలో మొత్తం 7 రకాల ఫార్మ్ లైవ్స్టాక్ యూనిట్లు కాజూపిట్టలు, నాటు కోళ్లు, బాతులు, కొర్రమేణు చేపలు, మేకల పెంపకం, కూరగాయల సాగు ,మునగ సాగు విజయవంతంగా నిర్వహి స్తున్నందుకు కలెక్టర్ అభినందించారు.

ఈ విధానం వల్ల జిల్లాలో మరింత కొంతమంది రైతులు సమీకృత వ్యవసాయం వైపు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలోని మహిళా సభ్యురాలు పి. జ్యోతి గారు పెంచుతున్న కాజూపిట్టల యూనిట్ను కూడా కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూకాజూపిట్టల పెంపకంతో నెలకు కనీసం రూ 10వేలు ఆదాయం పొందవచ్చని,వీటి గుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడమే కాకుండా,వీటి గుడ్లలో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల జిమ్కు వెళ్లే యువత కృత్రిమ ప్రోటీన్ పౌడర్లు వాడకుండా ఇవి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని,వీటి గుడ్లతో పచ్చళ్ళు తయారు చేస్తే మార్కెట్లో మరింత డిమాండ్ ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యచందన, సిబ్బంది పాల్గొన్నారు.