12 July, 2026 | 6:43 PM

Breaking News

రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవల పురస్కారం అందుకున్న జిల్లా వాసి   •   గాన కోకిల ఎస్.జానకికి లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఘన నివాళి   •   కుటుంబ కలహాలతో వ్యక్తి ఊరి వేసుకొని ఆత్మహత్య   •   సర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్   •   ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి   •   సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •  

జీవో 21ను వెనక్కి తీసుకోవాలి

08-04-2025 12:39 AM

 -పీ యూ ఒప్పంద అధ్యాపకులు

మహబూబ్ నగర్ ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) పాలమూరు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పరిపాలన భవన్ యందు తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ లలో సహాయ ఆచార్యుల నియామకం కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 21 ను తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం వీసీ ఆచార్య జీ ఎన్ శ్రీనివాస్ కి రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ బాబు కి ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాకే మిగిలిన పోస్ట్ లను నియమించాలని వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా సంఘం నాయకులు డా భూమయ్య గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీ లను నమ్ముకొని పనిచేస్తున్నామని, జేల్స్ డిగ్రీ లెక్చరర్ లను క్రమబద్దీకరించినట్టే యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులను క్రమబద్దికరించాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో డా రవికుమార్, డా శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డా వెంకటేష్, డా కరుణాకర్ రెడ్డి డా రవికాంత్,డా విజయ్ భాస్కర్, డా సోమేశ్వర్, డా శ్రీనివాస్, డా జంగం విశ్వనాధ్, డా బషీర్ అహ్మద్, డా ఆంజనేయులు,డా మృదుల, స్వాతి, సరిత, శారద,డా రామ్మోహన్, డా సిద్దరామ గౌడ్, డా శివ కుమార్ సింగ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు