12-06-2025 12:07:36 AM
జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు
పెద్దపల్లి జూన్ 11(విజయ క్రాంతి) జల్లాలోని నిరుద్యోగ యువకులకు వివిసి మో టార్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు కల్పించుటకు జూన్ 18న బుధవారం రూమ్ నెంబర్ 225 నూతన కలెక ర్ భవన సముదాయంలో గల జిల్లా ఉ పాధి కార్యాలయం లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు.
వివిసి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థలో 60 ఈవి సర్వీస్ టెక్నిషి యన్, ఆటోమేటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టు లు ఖాళీలు ఉన్నాయని, పోస్టులకు 10వ త రగతి , ఐటిఐ/ డిప్లమా, డీగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, వీరి వయస్సు 18 నుంచి 30 లోపు ఉండాలని, వీరికి వేతనం రూ. 12 నుంచి 15 వేల రూపాయల మధ్య ఉంటుందని,ఆసక్తి ఉన్నవారు .
జూన్ 18 ఉ దయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో రూం నెంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో, పెద్దకాల్వల పెద్దపల్లి మొ దటి అంతస్థులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 77299 92061, 924626743 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరా వు ఆ ప్రకటనలో తెలిపారు.