25 June, 2026 | 12:52 AM

ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్!

25-06-2026 12:13 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభోత్సవంలో చిత్రబృందంతోపాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో నిలబడి ఉన్న రజనీకాంత్.. ఆపరేషన్ డ్రెస్, డార్క్ గ్లాసెస్ ధరించి కనిపించారు.

చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. అగ్రనటులుగా భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా గుర్తింపు దక్కించుకున్న దిగ్గజన నట ద్వయం కమల్‌హాసన్, రజనీకాంత్ ఈ చిత్రం ద్వారా నటులుగానే కాక నిర్మాత-గానూ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.

సిమ్రాన్, రాశీ ఖన్నా ఈ చిత్రం లో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, అన్నదురై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.