25 June, 2026 | 12:50 AM

హోర్ముజ్ వద్ద రవాణా రుసుము లేదు!

25-06-2026 12:14 AM
  1. అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  2. ఇరాన్ స్పష్టమైన హామీ ఇచ్చిందంటూ ప్రకటన

వాషింగ్టన్, జూన్ ౨౪: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఎలాం టి రవాణా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై సాక్షాత్తు ఇరాన్‌నే తమకు హామీ ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన ‘ట్రూ త్ సోషల్’ ద్వారా ప్రకటించారు. ఇరాన్ ఒక్క రవాణా రుసుమే కాదని, బీమా ఖర్చులతోపాటు ఇంకా ఏ విధమైన చార్జీలూ వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.

కొన్ని మీడియాల్లో ఆ రుసుములన్నింటినీ ఇరాన్ వ సూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదని, అదంతా శుద్ధ అబద్ధమని కొట్టిపడే శా రు. ఇరాన్‌కు అమెరికా ఎలాంటి రుసుములు విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఇరాన్‌కు ఇవ్వాల్సిన రుసుము మొత్తం పూర్తి గా తమ నియంత్రణలోనే ఉన్నట్లు వివరించారు. ఆ సొమ్మును అమెరికా రైతుల నుం  చి మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ కొనుగోలు చేసేందుకు వినియోగిస్తామని వెల్లడించారు.

ఇరాన్‌కు ఆహార పదార్థాల అవసరం ఉందని, ఆయా పదార్థాలను అ మెరికా నుంచే కొనుగోలు చేసి, ఇరాన్‌కు ఇస్తామని చొప్పుకొచ్చారు. స్విట్జర్లాండ్‌లో వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మొదటి రౌండ్ చర్చలు ముగిసిన తర్వాత ఈ పరిణా మం చోటుచేసుకుంది.

అయితే.. ట్రంప్ ప్రకటనపై ఇప్పటివరకు ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఆర్థిక ప్రోత్సాహకాలు, హోర్ముజ్ నియంత్రణపై ఇరు దేశాలు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.