డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా గోడ పత్రిక ఆవిష్కరణ
దేవరకొండ,(విజయక్రాంతి): డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను బుధవారం దేవరకొండలోని ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ (అటానమస్) కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి, కోఆర్డినేటర్ డాక్టర్ వి. మకట్ లాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడుతూ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. చదువుతో పాటు అప్రెంటిస్ కింద వివిధ రంగాల్లో పని అనుభవం, ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఆయన తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




