8 April, 2026 | 6:10 PM

బీజేపీ, బీఆర్ఎస్ అనైతిక పొత్తు బట్ట బయలు

08-04-2026 04:42 PM

డీసీసీ ఉపాధ్యక్షులు రాజుర సత్యం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం ఏర్పాటు కోసం బిజెపి ,బీఆర్ఎస్ అనైతిక పొత్తు బట్టబయలైందని బిజెపి నాయకులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిర్వహణపై తప్పుడు ఆరోపణలు చేయడం ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని టిఆర్ఎస్ వారు తమ అభిమాన పార్టీకి చైర్మన్ పదవి పట్టడం కోసం కిందా మీద పడి శాంతియుత వాతావరణాన్ని పాడుచేసిన టిఆర్ఎస్ బిజెపి నాయకులుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మొదటి రోజున సరైన విధానాలు పాటించకుండా కౌన్సిలర్ల చేతులు లేపడం ప్రక్రియ సక్రమంగా జరపకుండా పోటీ నిర్వహించారు తాము ఖండించి ఎన్నికలు సజావుగా నియమ నిబంధన ప్రకారం జరగాలని మాత్రమే  ఎమ్మెల్యే సూచించారు. దీనిని ఇరు పార్టీలు రాజకీయంగా వాడుకొని అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరం అని అన్నారు.

బిజెపి బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వారు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చేతులు కలిపి బిజెపిని గెలిపించడానికి టిఆర్ఎస్ నాయకులు పనిచేశారని ఎద్దేవా చేశారు. అనంతరం ఎన్నికలు సజావుగా జరిగేందుకు తాము సహకరించామని ఇదే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అనైతికపొత్తును ప్రజలు గమనిస్తున్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిమ్మల రమేష్, నాయకులు గొర్రె గంగాధర్, జమాల్ ఖురేషి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షబ్బీర్ పాషలు ఉన్నారు.