మోదీ పాలనలో జాబ్‌లాస్ అభివృద్ధి
- ఉపాధి కల్పనను ప్రాథమిక హక్కుగా మార్చాలి
- ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ముషీరాబాద్, జూలై 15(విజయక్రాంతి): మన దేశంలో గతంలో జాబ్‌లెస్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు మోదీ పాలనలో జాబ్‌లాస్ అభివృద్ధి జరుగుతున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. అందరికీ తిండి, చదువు, వైద్యం, ఉపాధి కల్పన, పెన్షన్ ఇవ్వడాన్ని ప్రాథమిక హక్కులుగా మార్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జ్యాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి తమ పరిధిలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతి అధ్యక్షతన నిరుద్యోగుల మహాధర్నా నిర్వహించారు.






