రైతుల మనసులో మళ్లీ కేసీఆరే: జోగు రామన్న
ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోనీ ప్రతి గడప కేసీఆర్(KCR) పాలనను కోరుతుందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. పొలాల పండుగ సందర్భంగా శనివారం మాజీ మంత్రి జోగు రామన్న కరింజా గ్రామాన్ని సందర్శించారు. రైతులను ఆత్మీయంగా కలుసుకుని పలకరించారు. ఈ సందర్భంగా రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని, దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బస్తీ, దళిత బంధు వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు.
దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా రూ.10 లక్షల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బస్తీ పథకం ద్వారా కేటాయించిన భూముల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోర్లు వేయకపోవడం అమానుషమని విమర్శించారు.
పొలాల పండుగ సందర్భంగా 'రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రైతులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారశెట్టి గోవర్ధన్, ఇజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మెట్టు ప్రలాద్, గణేష్ యాదవ్, రామ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, దేవన్న, వెంకన్న, చెన్నూరు గంగన్న, సంకపాక లక్ష్మణ్, సంకపాక శంకర్, ఇరిగోళ్ల అశోక్, ఇరిగోళ్ల సంతోష్, బిక్కీ కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.