13 May, 2026 | 7:49 PM

జాన్సన్ రెడీమిక్స్ కార్మికులకు అండగా ఏఐవైఎఫ్

13-05-2026 06:39 PM

ఉప్పల్,(విజయక్రాంతి): 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు ఇలాంటి పరిష్కారం చేయకుండానే కంపెనీ మరొక కంపెనీకి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న  జాన్సన్ రెడ్ మిక్స్ ప్లాంట్ పై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.  నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న జాన్సన్ రెడీ మిక్స్ ప్లాంట్ కార్మికుల నిర్వహిస్తున్న ధర్నాకు ఆయన బుధవారం నాడు సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తూ రెడిమిక్స్ ప్లాంట్ ను అక్రమంగా మూసేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్న యజమాన్యంపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ మూసివేతకు రెండు నెలల ముందుగానే  కార్మికులకు మరియు ప్రభుత్వ నికి సమాచారం ఇచ్చి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని కార్మిక చట్టాలు చెబుతున్నప్పటికీ  జాన్సన్ లిమిటెడ్ రెడీమిక్స్ ప్లాంట్ యజమాన్యం నిర్లక్ష్యంగా ధోరణి వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ మరియు లేబర్ కమిషనర్ అధికారులు వెంటనే స్పందించి యజమానులతో చర్చించి కార్మికులు చేస్తున్న న్యాయమైన  డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికులు న్యాయం జరిగే వరకూ ఏఐవైఎఫ్ అండగా ఉంటుందని ఆయన కార్మికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు  గిరిబాబు నియోజకవర్గ అధ్యక్షుడు వికాస్ రెడ్డి రెడ్మి ప్లాంట్ కార్మికుల నరసింహ ప్రధాన కార్యదర్శి వెంకట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు