29 March, 2026 | 5:13 PM

సిరిసిల్ల 8, 9 వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

29-03-2026 03:43 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ... నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న యువకులకు స్వాగతం పలుకుతున్నాను. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోరుతూ అమలు చేస్తున్న పథకాల గురించి క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలి. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలు ఎఐసిసి, పిసిసి, డిసిసి, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఏ పిలుపు నైనా స్వీకరించి కార్యక్రమాల్లో పాల్గొనాలి. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, స్థానిక నాయకులు బడుగు బారత్, నాగరాజు, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.