15 June, 2026 | 2:48 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

విషాదం.. ఇద్దరు గొర్రెల కాపరులు మృతి

29-03-2026 03:49 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కే. లక్ష్మీరాజం (58), కుమ్మం మొండయ్య (50) అనే ఇద్దరు గొర్రెల కాపరులు చెరువులో మునిగి మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే, ఈ ఇద్దరు తమ గొర్రెలను స్నానం చేయించేందుకు గ్రామ సమీపంలోని చెరువుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొన్ని గొర్రెలు లోతైన నీటిలోకి వెళ్లడంతో, వాటిని బయటకు తీసేందుకు వారు చెరువులోకి దిగారు.

అయితే అనుకోకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లి అదుపుతప్పి మునిగిపోయారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.చెరువు వద్దకు చేరుకున్న ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.గ్రామస్తులు ఇద్దరి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.