హనుమాన్ చాలీసా పారాయణంతో బుద్ధిబలం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది
రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ విద్యాసాగర్
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో 58 వ ఆదివారం శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత మాజీ సైనికుడు, పెద్దముల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు సారా విద్యాసాగర్ మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణంతో బుద్ధిబలం, జ్ఞాపకశక్తి, ధైర్యం, ఏకాగ్రత, ప్రశాంతత ,భక్తి భావం కలుగుతుందని ప్రతి ఒక్కరూ నిత్యం ఉదయం సమయంలో పది నిమిషాల పాటు పారాయణం చేయాలని కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు పురుగుర్తి మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు నల్ల వెంకటరెడ్డి ,జక్కుల వీరప్ప, వడ్ల రాములు, నల్ల రంగారెడ్డి, చాకలి శేఖర్, ఎంట్రీ కాయల గోవిందు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హిందూ వాహిని కార్యకర్తలు, చిన్నారులు భారీగా పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు అల్పాహారం వితరణ చేశారు. మరోవైపు పెద్దెములు మండల పరిధిలోని మారేపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సైతం 22వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు ఎస్. గోపాల్ రెడ్డి గారు, ఆచారి రవి, మురళి గౌడ్ బి. యాదప్ప, సి.హెచ్. రాజు, బి. ముత్యాలప్ప, జి. అనిల్ హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .




