calender_icon.png 1 May, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో ఉమ్మడి జిల్లా ముందంజ

01-05-2025 01:50:34 AM

  1. వరుసగా 4, 5, 6 స్థానాల్లో జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్
  2.  10 వ స్థానంలో పెద్దపల్లి

బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో రాష్ర్టంలో జగిత్యాల జిల్లా నాల్గవ స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లా లో, ఎస్‌ఎస్సి పరీక్షలకు 2024- 25 సంవత్సరానికి 11849 (బాలురు 5962, బాలికలు 5887) మంది విద్యార్థులు హాజరవగా అందులో 11636 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు(బాలురు 5823- 97.67%, బాలికలు 5813- 98.74%). రాష్ర్టంలోనే జగిత్యాల జిల్లా మొత్తంగా 98.20%తో నాలుగవ స్థానంలో నిలిచింది. 

 రాజన్న సిరిసిల్ల 

జిల్లాలోని పదవ తరగతి  పరీక్షలకు 6754 మంది విద్యార్థులు హాజరుకాగా  6629 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 98.15%  ఉత్తీర్ణత శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ర్ట స్థాయిలో 5 వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 198 పాఠశాలల నుండి విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 128 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా లోని 13 కేజీబీవీలలో 10 కేజీబీవీలు 100% ఉత్తీర్ణత సాధించాయి. 

 కరీంనగర్ జిల్లా జిల్లా రాష్ర్ట స్థాయిలో  97.90 శాతం

ఉత్తీర్ణతలో 6వ స్థానంలో  నిలిచింది. పరీక్షకు హాజరైన 6616 మంది బాలురులకు 6451 మంది ఉత్తీర్ణులైనారు. బాలికలలో 5892 మందికి 5794 ఉత్తీర్ణులై 98 మంది ఈరుత్తీర్ణులైనారు. ఈ సారి జిల్లాలో 12508 మందికి 12245 ఉత్తీర్ణులై 263 మంది పరీక్షలలో తప్పారు. 

 పెద్దపెల్లి జిల్లాకు చెందిన  96.89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం 7 వేల 387 మంది విద్యార్థులు పెద్దపల్లి జిల్లాలో హాజరు కాగా 7 వేల 157 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 108 పాఠశాలల్లో 100 శాతం పాస్ పర్సంటేజ్ నమోదయిండి