calender_icon.png 1 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల పోరాటం ఫలించింది: జాజుల

01-05-2025 01:53:37 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30(విజయక్రాంతి): దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిసున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దీంతో బీసీల పోరాటం ఫలించిందని, కులగణనపై గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ఏప్రిల్ 2న ఢిల్లీ లో బీసీలు ధర్నా చేయడం, దీనిలో తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. బీసీల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, బీహార్, తెలంగాణ ప్రభుత్వాలు కులగణన చేపట్టడంతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగిందన్నారు. ఇప్పటికైనా సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు.