తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం
03-09-2024 10:57 AM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ రూ.కోట విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి తన వంతుగా సహాయపడాలని ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి చెరో రూ.50 లక్షల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. అతిత్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజులు కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షాల కారణంగా ప్రధాన నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైన్నాయి.






